Tuesday, November 16, 2010

meeremantaru?మీరేమంటారు?

 తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులు కావాలని చిన్నప్పటి నుంచి వారిని తమకు దూరంగా హాస్టళ్ళలో ఉంచి చదివిస్తే ఆ పిల్లలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను వృద్ద ఆశ్రమాలలో  ఉంచి చూసుకొంటున్నారు. ఈ రెండు చోట్ల జాగ్రత్త అనే మాట తప్ప ప్రేమ, ఆప్యాయత అనే బాంధవ్యాలకు చోటు కన్పించడం లేదు కదా..! ఇది నేటి పరిస్థితి అని నేనంటాను. మరి మీరేమంటారు?

Tuesday, November 9, 2010

meeremantaru?

బరాక్ ఒబామా ఎంతటి పెద్దమనిషి. ఇలా ఎందుకు అంటున్నానంటే ... అతను మన గురించి మన దేశం గురించి ఎంతో అవగాహన ఉన్నవాడనిపించింది. మన పురాణాలను స్మరించాడు. మన పంచతంత్ర  కథలను ప్రస్తావించాడు. మన జాతిపితను ఆరాధించాడు. మన దేశం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు చాలా హుందాగా ప్రవర్తించాడు. నేటి మన నేతలతో పోలిస్తే  ఒబామా ప్రత్యేకతే వేరంటాను. మరి మీరేమంటారు?